మనము తినే మాంసాహారాల్లో చేపలు ఎంతో ప్రత్యేకమైనవి మరియు వీటిలో కొవ్వుశాతం తక్కువగా ఉండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ డి , బి 2, పొటాషియం , ఫాస్పరస్ , జింక్ , ఐరన్ , మెగ్నీషియం ఉంటాయి కాబట్టి మన ఆరోగ్య విషయంలో ఎంతో విలువైనవి . వీటిని అనేక ప్రాంతాలలో వారి వారి అభిరుచులకు తగినట్లుగా అనేక రకాలుగా వండుకుంటుంటారు . అందులో చేపల ఫ్రై ప్రధానమైనది . మనలో అనేకమందికి చేపల ఫ్రై అనగానే నోరూరుతుంది అంతగా ఇష్టపడుతారు దీనిని . కాబట్టి మనము చేపల ఫ్రై రుచిగా ఏ విధంగా తయారుచేయాలో తెలుసుకుందాము . మొదట మనం మంచి చేపలను ఎంపిక చేసుకుని నచ్చిన విధంగా ముక్కలుగా చేసుకోవాలి . మరీ పెద్దవిగా కాకుండా సన్ననివిగా చేసుకోవాలి ఎందుకనగా అలా వుంటే అవి త్వరగా వేగుతాయి . వాటిని శుభ్రంగా కడగాలి . కడిగే విధానం ( శుభ్రపరచు విధానం ): ఉప్పు మరియు పసుపుని చేపలకు పూసి కొన్ని నిమిషాలు పక్కన ఉంచి వ్యర్థాలు పోవునట్లు ముఖ్యంగా చేపల కడుపు లోపలి భాగాన్ని బాగా కడగాలి . శుభ్రపరచుటకు ఉప్పు మరియు ప
Comments
Post a Comment