Skip to main content

How To Register Internet Banking In Telugu

SBI బ్యాంకులో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది   ఏ విధంగా రిజిస్టర్ (Register) చేసుకోవాలి అనే దాని గురించి మనం  step by step తెలుసుకుందాము.

1. https://www.onlinesbi.com/ అనే లింక్ ఓపెన్ చెయ్యాలి.
2. New user Registration/Activation  అనే దానిపై క్లిక్ చెయ్యాలి  కొత్త పేజి వస్తుంది.


3. అందులో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ (New user  Registration) సెలెక్ట్ చేసుకుని Next ప్రెస్ చెయ్యాలి.                                           

4. User Driven Registration -New user అని ఓపెన్ అవుతుంది.
  • Account Number : బ్యాంక్  అకౌంట్  నంబర్ టైప్ (Type) వ్రాయాలి. 
  • CIF (Customer Information file): CIF నంబర్  వ్రాయాలి ఇది మీ పాసుబుక్  (passbook) లో  మరియు  బ్యాంకు స్టేటుమెంట్ (statement)లో ఉంటుంది. 
  • Branch Code : ప్రతి  బ్రాంచ్ కి ఒక కోడ్ ఉంటుంది ఆ  బ్రాంచ్ కోడ్ (branch code) ఎంట్రి చెయ్యాలి.   
  • Country Code: మనది భారతదేశము కాబట్టి  ఇక్కడ ఇండియా అని  సెలెక్ట్  చెయ్యాలి.
  • Register Mobile Number :బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో  ఆ నెంబర్ ఎంటర్ చెయ్యాలి.     
  • Facility  Required: Full Transaction Rights అని సెలెక్ట్ చెయ్యాలి.
  • Enter The Text As Shown In The Image: ఇందులో అక్కడ ఇవ్వబడిన Numbers, Alphabets తో కూడిన నంబర్  ఎంటర్ చెయ్యాలి.
     పైన ఇవ్వబడిన వాటినన్నిటిని Fill చేసి  Submit చేయాలి.                                                         
5. మీ మొబైల్ నంబర్ కి OTP (One Time Password) వస్తుంది.  దానిని ఎంటర్ చేసి కంఫర్మ్ (Confirm) చేయాలి.   


6.   Internet Banking Registration ఓపెన్ అవ్వుతుంది:


  • I Have My ATM  Card (Online RegistrationWithout Bank Visit) అనగా నా దగ్గర ATM Card ఉంది బ్యాంక్ వెళ్లాల్సిన అవసరం లేదు అని దీని అర్థం దీనిని Tick చేయాలి
  • I  Do Not Have My ATM Card (Activation By Branch Only) అనగా నా దగ్గర ATM Card లేదు బ్యాంకుకి వెళ్ళాలి యాక్టివేషన్ కొరకు అని అర్థం  దీనిని అలాగే విడిచిపెట్టాలి.
 తరువాత Submit చెయ్యాలి. 

7. Debit Card Validation . దీనిలో డెబిట్ కార్డ్ వివరాలు తెలియజేయాలి. 
  • Card No : ఇందులో మన ATM Card పైన ఉన్నటువంటి 16 నంబర్లు వ్రాయాలి.
  • Valid To/ Expiry Date: ఇందులో మం ATM Card పైన వున్న Expiry నెల మరియు సంవత్సరం వ్రాయాలి. 
  • Card Holder  Name : అకౌంట్ ఎవరి పేరుమీద ఉందో  వారి పేరు వ్రాయాలి.
  • PIN (Personal Identification Number): ATM కి  సెట్ చేసుకున్న నాలుగు నంబర్ల  PIN వ్రాయాలి.  
  • Enter The Text As Shown In The Image: ఇందులో అక్కడ ఇవ్వబడిన Numbers, Alphabets తో కూడిన నంబర్  ఎంటర్ చెయ్యాలి.
తరువాత Proceed బటన్ నొక్కాలి.

8. Internet Banking Registration: Create Own Password

  • Temporary Username for Internet Banking:  దీనిలో   Teporary Username గా  ఉపయోగించడానికి బ్యాంకువారు  ఒక  నంబర్ ఇస్తారు. 
  • Enter New login Password: కొత్త  పాస్వర్డ్(password ) క్రియేట్ చేసుకోవాలి. 
  • Confirm New login Password: పైన ఎంటర్ చేసిన అదే పాస్వర్డ్ ఎంటర్ చెయ్యాలి.
తరువాత submit చెయ్యాలి.
ముఖ్య గమనిక: password  అనేది 8 నుంచి 20 అక్షరాలు ఉండాలి. అందులో ఒక Capital letter, ఒక Small letter, ఒక నంబర్ మరియు ఒక Special  Character ఉండాలి.    

9. Internet Banking Registration: ఇందులో Successfully Registered for Internet Banking అని వస్తుంది తరువాత  క్లోజ్ ప్రెస్  చెయ్యాలి. 

 10. రిజిస్టర్డ్ మొబైల్ కి Temporary Username వస్తుంది. Temporary Username, క్రొత్తగా క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఉపయోగించి Log -In అవ్వాలి.    


11. Welcome to Internet Banking! అని వస్తుంది. 
  •  Username ని మనకు నచ్చిన విధంగా టైపు చేసి I Accept the Terms and conditions టిక్ చెయ్యాలి. 

12. Choose Log In Password: దీనిలో  Permenent  Password ఎంటర్ చేసి Confirm  చెయ్యాలి.


13. Set  Profile Password :
  • ఇందులో మొదటి Profile Password  ఎంటర్ చేసి confirmation కోసం మరల ఎంటర్  చేయాలి. 


  • తరువాత Hint Question Select చేసుకుని Answer చెయ్యాలి. 
  • Date Of Birth రాయాలి. 
  • Place  Of  Birth వ్రాయాలి. 
  • Country సెలక్ట్ చెయ్యాలి. 
  • మొబైల్ నంబర్ ఇవ్వాలి. 
  • country కోడ్ సెలక్ట్ చెయ్యాలి. 
చివరిగా Submit చెయ్యాలి.
14. Set password: ఇందులో ఏమైనా మార్పులు చెయ్యాలంటే Proceed చెయ్యాలి. లేకపోతే Skip చెయ్యాలి.  


పై విధంగా మనము చేసినట్లైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ రిజిస్టర్ చేసుకోగలము. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
బ్యాంకువారు  customer  వివరాలు ఫోన్ చేసిగాని  మెసేజ్ రూపంలోగాని ఎవరిని  అడగరు. ఒకవేళ అడిగినట్లైతే అది మిమ్మల్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని దాని అర్థం. అందువలన మీరు అకౌంట్ వివరాలు ఎవరితోనూ పంచుకోకూడదు. 
  • OTP నంబర్ ఎవరికి చెప్పకూడదు. 
  • Passwords కి  మీ పేరు  కానీ నంబర్స్ మరియు Alphabets వరుసగా పెట్టుకోకూడదు. ఉదా : 123456, abcdef. 
  • ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉపయోగించింన ప్రతీసారి Log -Out చెయ్యడం మర్చిపోకూడదు.
ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనగానేమి దానియొక్క ఉపయోగాల గురించి తెలుసుకోవాలంటే   https://weimpressyou.blogspot.com/2020/04/blog-post_28.html లో చూడగలరు. 
ధన్యవాదాలు. 
Source: SBI bank website.  

Comments

Popular posts from this blog

what is internet banking In Telugu

ఈ   ఆధునిక   యుగంలో   టెక్నాలజి   అనేది   మానవుల   జీవితాలలో   అనేక   మార్పులు   తీసుకొచ్చింది   అలాగే   ముఖ్యమైన    పాత్ర   పోషిస్తోంది . మన   జీవితాలలో   తెలిసో    తెలియకనో    అనేక   విధాలుగా   మనం   దీనిని       ఉపయోగిస్తున్నాము .  ఈ   టెక్నాలజి   అనేది   బ్యాంకింగ్    రంగాన్ని   కూడా    తన    సాంకేతికతతో   వినియోగదారులకు    ఎంతో   సులభతరం   చేసింది . ఇందులో   ముఖ్యమైనది   ఇంటర్నెట్    బ్యాంకింగ్ .    ఇది     రావడానికి   ముందు   లావాదేవీలు  (Transactions)  అన్ని   కూడా    బ్యాంక్  ఉద్యోగులద్వారా    చేయబడేవి  మరియు   వినియోగదారుడు   ఖచ్చితంగా   బ్యాంక్   వెళ్ళాల్సిన    పరిస్థితి   ఉండేది .  అది   చాలా   అధిక   సమయంతో   కూడుకొన్నది   మరియు   కష్టతరమైనది   అని    చెప్పవచ్చు .   ఇంటర్నెట్   బ్యాంకింగ్   ఎప్పుడు   ప్రారంభించబడింది   :-   ఇంటర్నెట్   బ్యాంకింగ్    అనేది   మొట్టమొదటిసారిగా   నాటింగ్ ‌ హామ్   బిల్డింగ్   సొసైటీ   ( ఎన్ ‌ బిఎస్ )  వారి  హోమ్ ‌ లింక్   అనే   పేరుతో   United Kingdom  లో  1982  సెప్టెంబర్   న   ప్రారంభించడం   జరిగింది .  దీనిని    బ్యాంక్   ఆఫ్   స్క

How to Cook Delicious Fish fry in Telugu

మనము తినే మాంసాహారాల్లో చేపలు ఎంతో ప్రత్యేకమైనవి మరియు వీటిలో   కొవ్వుశాతం తక్కువగా ఉండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ , విటమిన్ డి , బి 2, పొటాషియం , ఫాస్పరస్ , జింక్ , ఐరన్ , మెగ్నీషియం ఉంటాయి కాబట్టి మన ఆరోగ్య విషయంలో     ఎంతో   విలువైనవి . వీటిని   అనేక ప్రాంతాలలో    వారి వారి అభిరుచులకు తగినట్లుగా   అనేక   రకాలుగా  వండుకుంటుంటారు . అందులో చేపల ఫ్రై   ప్రధానమైనది .  మనలో   అనేకమందికి చేపల ఫ్రై   అనగానే నోరూరుతుంది అంతగా    ఇష్టపడుతారు దీనిని .   కాబట్టి మనము చేపల ఫ్రై   రుచిగా ఏ విధంగా తయారుచేయాలో తెలుసుకుందాము . మొదట మనం మంచి చేపలను ఎంపిక చేసుకుని నచ్చిన విధంగా ముక్కలుగా   చేసుకోవాలి .   మరీ   పెద్దవిగా    కాకుండా సన్ననివిగా చేసుకోవాలి ఎందుకనగా అలా వుంటే అవి త్వరగా   వేగుతాయి .  వాటిని శుభ్రంగా కడగాలి . కడిగే విధానం ( శుభ్రపరచు విధానం ): ఉప్పు మరియు పసుపుని చేపలకు పూసి కొన్ని నిమిషాలు   పక్కన ఉంచి   వ్యర్థాలు   పోవునట్లు ముఖ్యంగా చేపల కడుపు   లోపలి భాగాన్ని   బాగా కడగాలి . శుభ్రపరచుటకు ఉప్పు మరియు ప