Skip to main content

How to Cook Delicious Fish fry in Telugu


మనము తినే మాంసాహారాల్లో చేపలు ఎంతో ప్రత్యేకమైనవి మరియు వీటిలో  కొవ్వుశాతం తక్కువగా ఉండి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ డి, బి2, పొటాషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్ , మెగ్నీషియం ఉంటాయి కాబట్టి మన ఆరోగ్య విషయంలో   ఎంతో  విలువైనవి. వీటిని  అనేక ప్రాంతాలలో   వారి వారి అభిరుచులకు తగినట్లుగా  అనేక  రకాలుగా  వండుకుంటుంటారు. అందులో చేపల ఫ్రై  ప్రధానమైనదిమనలో  అనేకమందికి చేపల ఫ్రై  అనగానే నోరూరుతుంది అంతగా  ఇష్టపడుతారు దీనిని.  కాబట్టి మనము చేపల ఫ్రై  రుచిగా విధంగా తయారుచేయాలో తెలుసుకుందాము.


మొదట మనం మంచి చేపలను ఎంపిక చేసుకుని నచ్చిన విధంగా ముక్కలుగా  చేసుకోవాలి.  మరీ  పెద్దవిగా  కాకుండా సన్ననివిగా చేసుకోవాలి ఎందుకనగా అలా వుంటే అవి త్వరగా  వేగుతాయివాటిని శుభ్రంగా కడగాలి.

కడిగే విధానం (శుభ్రపరచు విధానం):

ఉప్పు మరియు పసుపుని చేపలకు పూసి కొన్ని నిమిషాలు  పక్కన ఉంచి  వ్యర్థాలు  పోవునట్లు ముఖ్యంగా చేపల కడుపు  లోపలి భాగాన్ని  బాగా కడగాలి. శుభ్రపరచుటకు ఉప్పు మరియు పసుపుతోపాటు నిమ్మకాయ రసం కూడా ఉపయోగించవచ్చు.



కావల్సిన పదార్థాలు:

                     
    చేపలు                                                    1        కిలోగ్రామ్ 
                     
                          కారం పొడి                                              1        టీ స్పూన్

                          అల్లం వెల్లుల్లి పేస్ట్                               2        టీ  స్పూన్ 

                          జీలకర్ర పొడి                                          1        టీ స్పూన్

                          పసుపు                                                   1/2     టీ స్పూన్

                          ధనియాల పొడి                                      1        టీ స్పూన్

                          నిమ్మకాయ రసం                                   1        టీ స్పూన్

                          కార్న్ ఫ్లోర్ (మొక్కజొన్న పిండి)            2        టీ  స్పూన్

                          ఉప్పు                                                                 తగినంత


తయారు చేయు విధానం

మొదట ఒక పాత్ర తీసుకుని దానిలో పైన చెప్పబడిన మోతాదులో  (ఉప్పు, కారం పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్,   జీలకర్ర పొడి, పసుపు, ధనియాల పొడి, కార్న్ ఫ్లోర్, ధనియాల పొడి) వేసి మొత్తం కలిపి  మిక్స్ అయ్యేటట్లు కొన్ని నీళ్లు పోసి   బాగా కలిపి దానిని గట్టిగా మసాలా  పేస్ట్ వలె చేయాలి. ఒకవేళ కలర్ కావాలంటే Food colour వేసుకోవచ్చు.   శుభ్రంగా కడిగిన చేపలను తీసుకుని మనం తయారు చేసిన మసాలా చేప ముక్కలకు  అంటుకునే విధంగా కలిపి  ఒక గంట సమయం ఊరపెట్టాలి.

తరువాత పాన్ లో  ముక్కలు మునుగునంతగా మంచి నూనె పోయాలి. నూనె బాగా మరిగిన తరువాత  మనం ఊరపెట్టిన  ముక్కలను నూనెలో వేసి చిన్న మంటమీద 5 నిమిషాలు వేగనిచ్చి తరువాత రెండవవైపు  వేగునట్లు తిప్పాలి. అవి  ఎరుపు రంగులోనికి వచ్చేవరకు వాటిని వేగనివ్వాలి. వేగిన  తరువాత   వాటిని తీసి ఒక బౌల్ లో వేసుకోవాలి.  మీరు కావాలనుకున్న చేపల ఫ్రై తయారయ్యింది. వాటిమీద కొద్దిగా నిమ్మరసం  చల్లుకుని  తిన్నట్లయితే చాలా  రుచిగా ఉంటుంది.
                     
ధన్యవాదాలు.

Comments

Popular posts from this blog

what is internet banking In Telugu

ఈ   ఆధునిక   యుగంలో   టెక్నాలజి   అనేది   మానవుల   జీవితాలలో   అనేక   మార్పులు   తీసుకొచ్చింది   అలాగే   ముఖ్యమైన    పాత్ర   పోషిస్తోంది . మన   జీవితాలలో   తెలిసో    తెలియకనో    అనేక   విధాలుగా   మనం   దీనిని       ఉపయోగిస్తున్నాము .  ఈ   టెక్నాలజి   అనేది   బ్యాంకింగ్    రంగాన్ని   కూడా    తన    సాంకేతికతతో   వినియోగదారులకు    ఎంతో   సులభతరం   చేసింది . ఇందులో   ముఖ్యమైనది   ఇంటర్నెట్    బ్యాంకింగ్ .    ఇది     రావడానికి   ముందు   లావాదేవీలు  (Transactions)  అన్ని   కూడా    బ్యాంక్  ఉద్యోగులద్వారా    చేయబడేవి  మరియు   వినియోగదారుడు   ఖచ్చితంగా   బ్యాంక్   వెళ్ళాల్సిన    పరిస్థితి   ఉండేది .  అది   చాలా   అధిక   సమయంతో   కూడుకొన్నది   మరియు   కష్టతరమైనది   అని    చెప్పవచ్చు .   ఇంటర్నెట్   బ్యాంకింగ్   ఎప్పుడు   ప్రారంభించబడింది   :-   ఇంటర్నెట్   బ్యాంకింగ్    అనేది   మొట్టమొదటిసారిగా   నాటింగ్ ‌ హామ్   బిల్డింగ్   సొసైటీ   ( ఎన్ ‌ బిఎస్ )  వారి  హోమ్ ‌ లింక్   అనే   పేరుతో   United Kingdom  లో  1982  సెప్టెంబర్   న   ప్రారంభించడం   జరిగింది .  దీనిని    బ్యాంక్   ఆఫ్   స్క

How To Register Internet Banking In Telugu

SBI బ్యాంకులో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది   ఏ విధంగా రిజిస్టర్ (Register) చేసుకోవాలి అనే దాని గురించి మనం  step by step తెలుసుకుందాము. 1.  https://www.onlinesbi.com/  అనే లింక్ ఓపెన్ చెయ్యాలి. 2.   N ew user Registration/Activation   అనే దానిపై క్లిక్ చెయ్యాలి  కొత్త పేజి వస్తుంది. 3.  అందులో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ (New user  Registration) సెలెక్ట్ చేసుకుని Next ప్రెస్ చెయ్యాలి.                                            4.  User Driven Registration -New user అని ఓపెన్ అవుతుంది. Account Number : బ్యాంక్  అకౌంట్  నంబర్ టైప్ (Type) వ్రాయాలి.  CIF (Customer Information file): CIF నంబర్  వ్రాయాలి ఇది మీ పాసుబుక్  (passbook) లో  మరియు  బ్యాంకు స్టేటుమెంట్ (statement)లో ఉంటుంది.  Branch Code : ప్రతి  బ్రాంచ్ కి ఒక కోడ్ ఉంటుంది ఆ  బ్రాంచ్ కోడ్ (branch code) ఎంట్రి చెయ్యాలి.    Country Code : మనది భారతదేశము కాబట్టి  ఇక్కడ ఇండియా అని  సెలెక్ట్  చెయ్యాలి. Register Mobile Number :బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో  ఆ నెంబర్ ఎంటర్ చెయ్యాలి.