SBI బ్యాంకులో ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేది ఏ విధంగా రిజిస్టర్ (Register) చేసుకోవాలి అనే దాని గురించి మనం step by step తెలుసుకుందాము. 1. https://www.onlinesbi.com/ అనే లింక్ ఓపెన్ చెయ్యాలి. 2. N ew user Registration/Activation అనే దానిపై క్లిక్ చెయ్యాలి కొత్త పేజి వస్తుంది. 3. అందులో న్యూ యూజర్ రిజిస్ట్రేషన్ (New user Registration) సెలెక్ట్ చేసుకుని Next ప్రెస్ చెయ్యాలి. 4. User Driven Registration -New user అని ఓపెన్ అవుతుంది. Account Number : బ్యాంక్ అకౌంట్ నంబర్ టైప్ (Type) వ్రాయాలి. CIF (Customer Information file): CIF నంబర్ వ్రాయాలి ఇది మీ పాసుబుక్ (passbook) లో మరియు బ్యాంకు స్టేటుమెంట్ (statement)లో ఉంటుంది. Branch Code : ప్రతి బ్రాంచ్ కి ఒక కోడ్ ఉంటుంది ఆ బ్రాంచ్ కోడ్ (branch code) ఎంట్రి చెయ్యాలి. Country Code : మనది భారతదేశము కాబట్టి ఇక్కడ ఇండియా అని సెలెక్ట్ చెయ్యాలి. Register Mobile Number :బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్ ఎంటర్ చెయ్యాలి.
IMPRESSIVE
We IMPRESS you with information of food(recipe), banking, cricket and news.